చంద్రబాబు కాలాంతకుడని ఆనాడే ఎన్టీఆర్ కు చెప్పా : ఎర్రబెల్లి

చంద్రబాబు కాలాంతకుడని ఆనాడే ఎన్టీఆర్ కు చెప్పా : ఎర్రబెల్లి

చంద్రబాబు కాలాంతకుడు అన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ విషయాన్ని తాను ఆనాడే ఎన్టీఆర్ కు చెప్పానని అన్నారు. టీడీపీలోకి వస్తున్నప్పుడే చంద్రబాబును వ్యతిరేకించినవారిలో తాను ఒకడిని అని చెప్పారు. కష్టపడినా టీడీపీలో గుర్తింపు దక్కలేదని అన్నారు. ఆంధ్ర మంత్రులు రోజూ తమకు ఫోన్లు చేస్తుంటారనీ.. హైదరాబాద్ లో చంద్రబాబుకు బాగా బుద్ధి చెప్పి మంచి పనిచేశారని అంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు… అక్కడి టీడీపీ నేతలకు కూడా ఇష్టంలేదని అన్నారు.

తాను ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నాననీ.. కానీ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. కేసీఆర్ తనను నమ్మి పెద్ద బాధ్యత అప్పగించారనీ.. రాజకీయాలకు అతీతంగా పని చేస్తానని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రారంభించింది ఎవరో గుర్తుచేసుకోవాలని అన్నారు. గతంలో తాను ఎంపీగా గెలిస్తే… తనను కూడా కొనాలని చూశారన్నారు. పిలవకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే టీఆర్ఎస్ లోకి వచ్చి స్వచ్చందంగా జాయిన్ అవుతున్నారని చెప్పిన ఎర్రబెల్లి..  నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వలసలు పెరిగాయని వివరించారు.