
తొర్రూర్: పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు పట్టణంలో కోచింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆమె... ఈ నెల 9వ తేదీ నుంచి కోచింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. తొర్రూరు లోని శ్రీనివాస గార్డెన్ లో ప్రతి రోజు ఉదయ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులతో పాటు... ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇతర వివరాల కోసం 9550032354 నంబర్ ని సంప్రదించాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం...