ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలె

ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలె

సరూర్ నగర్: నాగరాజు హత్యకు సంబంధించిన కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. సరూర్ నగర్ లో ఇటీవల హత్యకు గురైన దళిత యువకుడు నాగరాజు కుటుంబాన్ని రాజా సింగ్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాగరాజును హత్య చేసింది మొత్తం నలుగురు అని ప్రత్యక్ష సాక్షియైన అతడి భార్య చెబుంతోంటే... పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరినే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. మిగతా ఇద్దరిని అరెస్ట్ చేయకపోవడం వెనుక పెద్ద వాళ్ల హస్తం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.

ముస్లిం యువతిని పెళ్లి చేసుకుంటే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. నాగరాజు హత్యకు ఓల్డ్ సిటీలో ప్లాన్ వేసినట్లు అనుమానం కలుగుతోందని అన్నారు. ఇలా నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతోంటే... నిందితులను శిక్షించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి... త్వరిత గతిన  విచారణపూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం...

రెడ్ల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

TSRTC లాభాల బాట పట్టింది