ఎర్రమంజిల్ కూల్చివేత : సర్కార్ కు హైకోర్ట్ ఝలక్

ఎర్రమంజిల్ కూల్చివేత : సర్కార్ కు హైకోర్ట్ ఝలక్

ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది హైకోర్ట్. 15రోజుల్లో ఎర్రమంజిల్ సచివాలయ నిర్మాణాలపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు ప్రభుత్వతరపు న్యాయవాది. అలాగైతే  కోర్ట్ ఉత్తర్వులు వెల్లడించే వరకు ఇప్పట్లో సెక్రటేరియట్ నిర్మాణం, ఎర్రమంజిల్ కూల్చివేతపై ఎలాంటి చర్యలు చేపట్టోద్దని తెలిపింది హైకోర్ట్. వెంటనే వెనక్కి తగ్గి మధ్యాహ్నం వరకు కౌంటర్ చేస్తామని చెప్పారు ప్రభుత్వ తరపు న్యాయవాది.

గత విచారణలో సచివాలయం నిర్మాణంపై దాఖలైన పిటిషన్ పై సోమవారం కౌంటర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మధ్యాహ్నం కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపిసస్తామని ప్రభుత్వం చెప్పడంతో.. కేసును మధ్యాన్నంకు వాయిదా వేసింది హైకోర్టు.