టీకా సర్టిఫికేట్‌లో త‌ప్పుల‌ను ఇలా సరిచేసుకోండి 

V6 Velugu Posted on Jun 09, 2021

కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో త‌ప్పులు వస్తే కొవిన్ పోర్ట‌ల్ ద్వారా వాటిని స‌రిచేసుకోవ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. టీకా సర్టిఫికేట్‌లో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసినట్లు ప్ర‌క‌టించింది.

స‌ర్టిఫికెట్‌లో పేరు, పుట్టినతేదీ, మేల్, ఫిమేల్ వంటి వివరాలు త‌ప్పుగా ప‌డితే కొవిన్‌ పోర్టల్ ఓపెన్ చేసి మొబైల్ నంబ‌రును న‌మోదు చేయాల‌ని సూచించింది. ఆ తర్వాత ఫోన్ నంబ‌రుకు వ‌చ్చే OTP ని ఎంటర్ చేస్తే కొవిన్‌లో యూజ‌ర్ల‌ ఖాతా ఓపెన్‌ అవుతుందని చెప్పింది. 

ఆ తర్వాత అకౌంట్ డీటైల్స్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి.. రైజ్ యాన్ ఇష్యూ అనే బటన్ పై  క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత  క‌రెక్ష‌న్ ఇన్ స‌ర్టిఫికెట్ ఆప్షన్‌ కనిపిస్తుంది.. దాన్ని క్లిక్‌ చేస్తే పేరు, పుట్టినతేదీ, జెండర్ లో మార్పులు చేసుకోవ‌చ్చ‌ని వివ‌రించింది. ఈ సర్టిఫికెట్ ను ఒకసారి మాత్రమే ఎడిట్‌ చేసుకునే అవకాశముంది.

Tagged Covid-19 vaccine certificates, corrected Errors, Covin Portal

Latest Videos

Subscribe Now

More News