ఎరుకల ఆత్మగౌరవ భవనం ప్రారంభించాలి

ఎరుకల ఆత్మగౌరవ భవనం ప్రారంభించాలి
  •     తెలంగాణ ఎరుకల సంఘం విజ్ఞప్తి

ముషీరాబాద్,వెలుగు : ఎరుకల కులస్తులకు నిజాంపేటలో ఎకరం భూమిలో రూ. 3.50 కోట్లతో నిర్మించిన ఆత్మగౌరవ భవనాన్ని ప్రభుత్వం ప్రారంభించి జాతికి అంకితం చేయాలని తెలంగాణ ఎరుకల సంఘం విజ్ఞప్తి చేసింది. నిజాంపేటలో పూర్తయిన ఎరుకల ఆత్మ గౌరవ భవనాన్ని బుధవారం సంఘం ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్ర సత్యనారాయణ, అధ్యక్ష కార్యదర్శులు కుతాడి రాములు, లోకిని రాజు మాట్లాడుతూ..

 మారుమూల గ్రామాల్లో ఉండే ఎరుకల యువత ఉన్నత చదువుల కోసం హైదరాబాదులో ఉండేందుకు చాలా ఇబ్బందిగా ఉండేదన్నారు. గత ప్రభుత్వంతో అనేక సార్లు సంప్రదించామని, తమ పోరాటాల ఫలితంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుపేద ఎరుకల విద్యార్థులకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వెంటనే ఎరుకల భవనం ప్రారంభించి అంకితం చేయాలని కోరారు. కుతాడి రవికుమార్, గోపాల్, శ్రీరామ్, ఆనంద్, నాగులు, పోచయ్య, ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.