
బాలీవుడ్ స్టార్ కపూల్ ఈషా డియోల్, భరత్ తక్తానీ విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఇద్దరు పిల్లల సంరక్షణ తమకు ముఖ్యమని తెలిపారు. ఈషా బాలీవుడ్ జంట ధర్మేంద్ర మరియు హేమమాలినిల చిన్న కుమార్తె. 21 ఏళ్ల వయసులోనే అంటే 2002లోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
2008వరకు దాదాపు ఆరేళ్లలో 30కి సినిమాల్లో నటించింది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు మూడేళ్లు బ్రేక్ ఇచ్చిన ఈషా డియోల్.. ఇప్పుడు ఓటీటీల్లో నటిస్తోంది. వివాహమైన 12 సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోయింది. గతేడాది జూన్‌లో ఈషా, భరత్ తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈషా తన భర్తకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలతో శుభాకాంక్షలు తెలిపింది.
అయితే గతేడాది హేమ మాలిని పుట్టినరోజు సందర్భంగా ఈషా డియోల్ తో భరత్ కనిపించకపోవడంతో వారి విడాకుల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.. అంతేకాకుండా ఈషా పుట్టినరోజు వేడుకలకు కూడా భరత్ హాజరు కాలేదు.