
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుల్లో ఇషా రెబ్బా ఒకరు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అవలేదు. తమిళంలోనే ఎక్కువ ఆఫర్లు రావడంతో కొన్నాళ్లు అక్కడ బిజీగా మారింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటోంది.
మళయాలం వైపుగా కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రీల్ లైఫ్ తో పాటుగా రియల్ లైఫ్ నూ ఈ బ్యూటీ బాలెన్స్ చేసుకుంటుంది. ఓ తమిళ దర్శకుడితో ఇషా ప్రేమలో ఉందని.. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో ‘అయిరామ్ జెన్మంగల్’ అనే సినిమాతో పాటు‘ఒట్టు’ అనే తమిళ, మళయాల బైలింగ్వల్ లోనూ నటిస్తోంది.