ఎన్ఐఆర్ఎఫ్లో ఎస్సార్ వర్సిటీకి 91వ ర్యాంక్.. ఇంజనీరింగ్ కేటగిరీలో100లోపు స్థానం

ఎన్ఐఆర్ఎఫ్లో ఎస్సార్ వర్సిటీకి  91వ ర్యాంక్.. ఇంజనీరింగ్ కేటగిరీలో100లోపు స్థానం
  • ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్​లర్ ఎనగందుల వరదారెడ్డి

హసన్ పర్తి, వెలుగు: నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)–2025లో ఎస్సార్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కేటగిరీలో 91వ ర్యాంకును సాధించిందని వర్సిటీ చాన్సలర్ ఎనగందుల వరదారెడ్డి అన్నారు. శనివారం (సెప్టెంబర్ 06) ఎస్సార్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు. 

తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీలలో ఇంజనీరింగ్ కేటగిరీలో టాప్–100లో స్థానం పొందిన ఏకైక సంస్థ ఎస్సార్ విశ్వవిద్యాలయం మాత్రమేనని తెలిపారు. వరుసగా నాలుగో ఏడాది ఈ ప్రతిష్టాత్మక ర్యాంక్ దక్కించుకోవడంలో  విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం, విద్యార్థుల కృషి ఉందని చెప్పారు. 

అనంతరం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రైవేట్ వర్సిటీల్లో ఎస్సార్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. బలమైన అధ్యాపక బృందం,  సమర్థవంతమైన పరిశోధనల ఫలితంగా 5000+ రీసెర్చ్ పేపర్లు, 50+ పేటెంట్లు పొందామని వివరించారు.   ప్రొఫెసర్ వైస్ చాన్సలర్  వి. మహేశ్, రిజిస్ట్రార్.ఆర్. అర్చన రెడ్డి, వివిధ స్కూల్స్ డీన్స్, వివిధ విభాగాల హెడ్స్, అధ్యాపకులు కూడా పాల్గొన్నారు.