వాటర్​బోర్డు ఆధ్వర్యంలో101 చలివేంద్రాల ఏర్పాటు

వాటర్​బోర్డు ఆధ్వర్యంలో101 చలివేంద్రాల ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లోని వేర్వేరు ప్రాంతాల్లో వాటర్​బోర్డు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.వివిధ అవసరాల కోసం ఇంటి నుంచి బయటకి వచ్చే జనం దాహార్తిని తీర్చేందుకు మెయిన్​హాస్పిటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైతు బజార్లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో తాగునీటిని అందిస్తోంది. ఓఆర్ఆర్ పరిధిలో 70, జీహెచ్ఎంసీ పరిధిలో 31 కలిపి మొత్తం 101 చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నాలుగు కేంద్రాలను ప్రారంభించింది. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం చార్మినార్​లోని మక్కా మసీదు వద్ద వాటర్​క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే వారికి బాటిళ్లు, ప్యాకెట్ల ద్వారా నీరు అందజేయనుంది. అలాగే సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లోని మసీదుల వద్ద స్టాళ్లు ఏర్పాటు చేయనుంది.