ఆరోగ్య పథకాలకు కేంద్రం సాయం కావాలి: ఈటెల

ఆరోగ్య పథకాలకు కేంద్రం సాయం కావాలి: ఈటెల

తెలంగాణ వైద్య రంగంలో  కొత్త సంస్కరణలకు  సహకరించాలని  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  హర్షవర్దన్ ను కోరారు మంత్రి ఈటెల.ఢిల్లీలో ఆయనతో భేటీ అయిన ఈటెల  తెలంగాణ వైద్యరంగంలో కేంద్రం సాయం కావాలని కోరామన్నారు. దీనికి సంపూర్ణ సహకారం ఇస్తామని కేంద్రమంత్రి  హామీ ఇచ్చారని చెప్పారు. కాకతీయ మెడికల్ కాలేజ్ లో సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఆదిలాబాద్ లో మరో సూపర్ స్పెషల్ హాస్పిటల్ బ్లాక్ నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని కోరామన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయని..ఖమ్మం, కరీంనగర్ రెండు జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో మెడికల్ కాలేజీలకు అనుమతి ఆడిగామన్నారు ఈటెల.

కొత్తగా ఏర్పడిన జిల్లాలో జిల్లా ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆయుష్మన్ భారత్ అమలుతో చాలా మంది నష్టపోయే అవకాశం ఉందన్నారు . రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు సంఖ్యను పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు ఈటెల.