ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల గొడవలయ్యాయి. మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత మురళీధర్ రావు పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా జనగామలో గురువారం బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది. గాయపడిన వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జనగామ బయలుదేరాలని అనుకున్నారు. అయితే బీజేపీ పిలుపునిచ్చిన మౌనదీక్షకు అనుమతిలేదని పోలీసులు.. ఈటలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులుంటాయన్నారు. నిరసనలు, బంద్ లకు టీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కు వంతపాడుతున్నారని విమర్శించారు. 

For More News..

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తా