మునుగోడులో హుజురాబాద్ ఫలితాలే రిపీట్ అవుతయి

మునుగోడులో హుజురాబాద్ ఫలితాలే రిపీట్ అవుతయి

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడుగడ్డపై సీఎం కుర్చీవేసి కూర్చుంటా అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్యమంత్రి , మంత్రులు వస్తారని..ఆ తర్వాత ప్రజల కంటికి కూడా కనిపించరని ఆరోపించారు. హుజురాబాద్ లో వచ్చిన ఫలితాలే మునుగోడులో మళ్లీ రిపీట్ అవుతాయన్నారు. మద్యం సీసాలు, డబ్బుల సంచులు కాదు ధర్మం న్యాయం గెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజల విశ్వసం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ..తెలంగాణ ప్రజలతో, ఉద్యమకారులతో కేసీఆర్ కు బంధం తెగిపోయిందన్నారు.

తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు...రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించకుండా బీఆర్ఎస్ పార్టీ పేరుతో మరో డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జిమ్మిక్కులు ఈసారి పనిచేయవని..దోచుకున్నవి దాచుకోడానికే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ త్వరలో వీఆర్ ఎస్ తీసుకోవడం ఖాయన్నారు.