MLC కవితను విమర్శించే హక్కు ఈటలకు లేదు

MLC కవితను విమర్శించే హక్కు ఈటలకు లేదు

RTC ‌ఉద్యోగులు ఆత్మగౌరవ పోరాటంలో.. సీఎం కేసీఆర్ సారథ్యంలో చిత్తశుద్ధి తో పనిచేశామన్నారు తెలంగాణ మజ్దూర్ యూనియన్(TMU) జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ..ఎమ్మెల్సీ కవితను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. TMU గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని అనేకసార్లు ఎమ్మెల్సీ కవిత ను తాము కోరామని..అయితే పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని ఆమె చెప్పారన్నారు. ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులను పెట్టుకునే హక్కుందన్నారు. 

ఈటల కొడుకు, భార్య పేరిట వందలాది ‌ఎకరాలు స్థలాలు ఉన్నాయని తెలిసిందన్న థామస్ రెడ్డి.. ఈటల.. ఏ ఆత్మగౌరవంతో బీజేపీ లోకి వెళ్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించారు కదా? సింగరేణి, ఆర్టీసీ, ఎల్ ఐసీ సంస్థలను మీరు కాపాడుతారా? బడుగులకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. RTC పై సీఎం కేసీఆర్ కు ప్రేమ ‌ఉంది కాబట్టే బడ్జెట్‌లో మూడు వేల కోట్లు ‌కేటాయించారన్నారు. ఇటీవలే వెయ్యి ‌కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో విడుదల చేశారన్నారు. 

హుజురాబాద్ ప్రజలకు..ఈటల ప్రభుత్వ ఫలాలను అందించారు తప్ప, సొంతంగా ఏమైనా ఇచ్చారా అని అన్నారు థామస్ రెడ్డి. ఉద్యమంలో నిజమైన త్యాగాలు చేసింది ఆర్టీసీ ‌ఉద్యోగులు, కార్మికులన్నారు. ఐదేళ్లుగా అసంతృప్తి ఉంటే.. పదవిలో ఉన్నప్పుడు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల అండ ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.