
పర్సనల్ లోన్ను గడువు కంటే ముందే చెల్లించడం క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుందని అనుకుంటారు. నిజానికి, రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం మీ క్రెడిట్‌కు పాజిటివ్ అవుతుంది. లోన్ను తిరిగి చెల్లించడం వలన మీ యాక్టివ్ అకౌంట్ల సగటు వయస్సు కొద్దిగా తగ్గుతుంది. - ఉదాహరణకు, మీకు ఒక పాత క్రెడిట్ కార్డు, ఒక కొత్త క్రెడిట్ కార్డు, ఒక లోన్ ఉన్నాయనుకుందాం. లోన్ అకౌంట్ క్లోజ్ అయినప్పుడు, మీ మిగిలిన అకౌంట్ల సగటు వయస్సు కాస్త ప్రభావితం కావచ్చు. ఇది చాలా స్వల్పమైన ప్రభావం. కానీ ఇది మీరు లోన్ను తిరిగి చెల్లించగలరని కూడా చూపిస్తుంది. అంతిమంగా మీ క్రెడిట్ స్కోర్‌పై చాలా సానుకూల ప్రభావం ఉంటుంది.
క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన చాలా విషయాల్లో జనంలో అపోహలు ఉన్నాయి. క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయడం, ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం, లోన్ల వాయిదాల చెల్లింపు, అప్పులు తీసుకోవడం గురించి చాలా మంది అనవసరంగా ఆందోళన పడుతుంటారు. ఇలాంటి అపోహలపై అవగాహన కలిగించే కథనం ఇది.
క్రెడిట్ కార్డుపై ఎప్పుడూ కొంత అప్పు ఉంటేనే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని కొందరు పొరబడుతుంటారు. ఇది నిజం కాదు. నెలల తరబడి కార్డులో లోన్ ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. స్కోర్ పెరగాలంటే ప్రతి నెలా బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించాలి. ఇది మీరు క్రెడిట్‌ను బాధ్యతాయుతంగా వాడుకుంటున్నారని సూచిస్తుంది. మీ క్రెడిట్ వాడకం నిష్పత్తిని తగ్గిస్తుంది. ఈ రెండూ మీ స్కోర్‌కు సహాయపడతాయి.