Hair Beauty: జుట్టు ఎందుకు తెల్లబడుతుంది.. ఇలా చేస్తే ఎప్పుడూ నల్లగా ఉంటుంది..!

Hair Beauty:  జుట్టు ఎందుకు తెల్లబడుతుంది..  ఇలా చేస్తే ఎప్పుడూ నల్లగా ఉంటుంది..!

అప్పుడే జుట్టు తెల్లబడిందా.. అని ఎగతాళి చేయడం చాలాసార్లు చూస్తుంటాం. జుట్టు తెల్లబడడం అంటే రంగు నెరిసిపోవడం కాదు. ఇంకా చెప్పాలంటే నల్లజుట్టు, తెలుపు రంగులోకి మారదని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. మరయితే తెల్లగా ఎందుకు కనిపిస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

నిజానికి వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడుతుంటుంది. అలాంటప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. కానీ, కొన్నిసార్లు వయసుతో సంబంధం లేకుండానే జుట్టు తెల్లబడుతుంది. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొందరికి జెనెటికల్ గా జుట్టు తెల్లబడుతుంది..

జుట్టు ఎప్పటికీ నల్లగా ఉండాలంటే ..

జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇతర కారణాలతో మార్పులు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. మెలనిన్ పెంచుకోవడానికి క్యారెట్, నల్ల నువ్వులు, వాల్​నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, మసూరి పప్పు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నువ్వుల నూనె, మెంతుల పొడి కలిపి తలకు మసాజ్ చేసి... అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకల్లో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు నల్లబడుతుంది.

అసలు రంగేది?

జుట్టుకు నల్ల రంగును తెచ్చే మెలనిస్ తలలోని చర్మం కింది భాగంలో, వెంట్రుకల్లో  ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపురంగులో కనిపిస్తుంది. అంటే తెలుపు అనేది రంగు కాదు. ప్రతీ వెంట్రుక ట్రాన్సఫరెంట్ గా , ఓ గొట్టంలా ఉంటుంది.. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. మెలనిన్ లేకపోతే... గొట్టం ఖాళీగా ఉండి... వెంట్రుక తెలుపుగా కనిపిస్తుందంతే.

మెలనిన్ ఎందుకు తగ్గిపోతుంది?

జీన్స్: తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు త్వరగా వైట్ హైయిర్ వస్తే... వాళ్ల పిల్లలకు, మనవళ్లకు కూడా అలా జరిగే అవకాశాలుంటాయి. అందుకు కారణం వాళ్ల నుంచి వచ్చే జీన్స్. ఆ తర్వాతి తరం వాళ్లలో కూడా ఉండడమే.

టెన్షన్లు: పని ఒత్తిళ్లు, టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, ఆహార మార్పులు, హైబీపీ వంటివి తలలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

ఆటో ఇమ్యూన్ డిసీజ్: ఒక్కోసారి శరీరంలోని ఇమ్యూనిటీ తన సొంత కణాల పైనే దాడి చేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

థైరాయిడ్ సమస్య: గొంతులో సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. శరీరంలోని చాలా అవయవాలు సరిగా పనిచేసేలా చేస్తుంది. ఇదే సరిగా పనిచెయ్యకపోతే.. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

విటమిన్ B12 తగ్గిపోతే: త్వరగా జుట్టు నెరిసిపోయిందంటే దానర్థం..  శరీరంలో విటమిన్ B12 సరిపడా లేనట్లే. ఇది జుట్టుకు ఎంతో మేలు చేసే విటమిన్. ఆక్సిజన్​ ను  తీసుకెళ్లే ఎర్రరక్తకణాలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బి12 సహకరిస్తుంది. అది లేనప్పుడు ఎర్రరక్తకణాలు జుట్టుకి చేరవు. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. విటమిన్ B12 కోసం చేపలు, బాదం పప్పు, పీతలు, పాలు, వెన్న, గుడ్లు, చికెన్ తినాలి.

స్మోకింగ్: పొగతాగడం మానకపోతే...అది జుట్టుకి పొగబెడుతుందని పరిశోధనల్లో తేలింది. ఎలాగంటే పొగ ఎర్రరక్తకణాల్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది

–వెలుగు,లైఫ్​–