నా బర్తరఫ్ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం

నా బర్తరఫ్ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం

హుజురాబాద్: తన బర్తరఫ్ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. ప్రతి ఒక్కడికీ టీఆర్‌ఎస్ ఓడిపోవాలని ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం కేసీఆర్ ఆధీనంలో ఉండదన్నారు. అది ఢిల్లీలో ఉంటుందని చెప్పారు. కేసీఆర్ నచ్చిన పోలింగ్ ఆఫీసర్లను వేస్తే ఊరుకోనన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణ అంతా తిరుగుతానని పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో అడ్డగోలుగా పోలీసులను మారుస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం కేసీఆర్ జేజమ్మ నుంచి కూడా కాదని వ్యాఖ్యానించారు. నాయకులను కొనొచ్చు కానీ ప్రజలను కొనలేమని చెప్పారు. పెన్షన్లు కేసీఆర్ తాత జాగీర్ కాదని, పథకాలను ఆపడం ఎవరి వల్లా కాదని ఈటల తెలిపారు.