మున్సిపల్ అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న మంత్రి

మున్సిపల్ అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న మంత్రి

కరీంనగర్: మున్సిపల్ అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్నారు టీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన పట్టన ప్రగతి కార్యక్రమంలో పాల్గోన్న ఆయన… ఖాళీ స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టించాలని సీఎం ను కోరామని చెప్పారు. ఇందుకుగాను  జీఓ త్వరలో వచ్చే అవకాశం ఉందని అన్నారు.

డ్రైనేజీ నిర్మాణ పనులు సక్రమంగా చేయాలని.. నీరు నిలువ ఉండకుండా చూడాలని అన్నారు ఈటెల. డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ వ్యాధులు వస్తే లక్షలాది రూపాయలు ఖర్చుచేయాల్సి ఉంటదని అన్నారు. డబుల్ బెడ్ రూము ఇళ్లను లబ్ధిదారులకు ఎలాంటి ఫైరవి లేకుండా అందజేయాలని…. హుజురాబాద్ లో నెల రోజుల్లో అన్ని రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో మురికి నీరు, చెత్త పేరుకు పోతోందని… ప్లాట్లు ఉన్నవారికి నోటీసులు జారీ చేయాలని… ప్రతి ఇంటికి నల్లలు బిగించాలని ఆదేశించారు. నిధులు ఉన్నప్పటికి వాటిని ఖర్చు చేస్తలేరని ఫైర్ అయ్యారు.