కరోనాను ప్రభుత్వం ఒక్కటే ఎదుర్కొలేదు..ప్రజలే ఎదుర్కోవాలి

కరోనాను ప్రభుత్వం ఒక్కటే ఎదుర్కొలేదు..ప్రజలే ఎదుర్కోవాలి

కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో కరోనా పై మొట్ట మొదటి సారిగా స్పందించింది తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.  దేశంలో కరోనా కట్టడికి కరీంనగర్  ఆదర్శంగా నిలిచిందన్న ఆయన…కంటోన్మెంట్ ప్రాంతానికి అర్థం చెప్పింది కరీంనగరేనని కొనియాడారు.  కరోనా విషయంలో ఐసీఎంఆర్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. కరోనాను ప్రభుత్వం ఒక్కటే ఎదుర్కొలేదని, ప్రజలే ఎదుర్కోవాలని అన్నారు. మాస్కులు ధరించడం,  సామజిక దూరం పాటించడం వంటి  జాగ్రత్తలు  తీసుకోవడం  తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలను బతికించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్న ఈటెల..దేశంలోనే అత్యధికంగా మనరాష్ట్రంలోనే మెడికల్ ఎక్కువగా ఉన్నాయని, ప్రైవేట్ డికల్ కళాశాలలు బాధ్యత గా భావించి వైద్యం అందించాలని కోరారు.