రైతుబంధు పేదవాళ్లకు మాత్రమే ఇవ్వమనడం తప్పా..?

రైతుబంధు పేదవాళ్లకు మాత్రమే ఇవ్వమనడం తప్పా..?

హైదరాబాద్: కేసీఆర్ డబ్బును మాత్రమే నమ్ముకున్నాడని తెలిపారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్‌కు తనకు వచ్చిన గ్యాప్ ఇవాళ రాలేదని.. ఐదేళ్ల క్రితమే వచ్చిందన్నారు. ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్‌ జిల్లాకు ఉందని.. కేసీఆర్‌ కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నాడని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరన్నారు. హరీశ్‌రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం వెళితే గేట్ దగ్గరే ఆపేశారని.. రెండో సారి అపాయింట్ మెంట్ తీసుకుని పోయామని తెలిపారు. రెండోసారి కూడా గేట్ల నుంచే బయటకు పంపించారని.. మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్‌ను అడిగానని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల సీఎం కేసీఆర్ పై పలు ప్రశ్నలు విసిరారు.

*ఎవరో ఒకరు లేఖ రాస్తే మంత్రిపై విచారణ జరుపుతరా
*రాత్రికి రాత్రి కేబినెట్ నుంచి ఎలా బర్తరఫ్ చేస్తరు
*ఎన్నికల్లో కుంట్రలు, కుతంత్రాలు,డబ్బుల సంచులే ముఖ్యమా
*ముఖ్యమంత్రికి చెప్పి హామీలిస్తాననడం తప్పా
*బొగ్గుగని కార్మిక సంఘంలో కేసీఆర్ బిడ్డకు ఏం పని
*ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణగదొక్కావ్
*CMOలో, ఒక్కSC,ST,BC ఐఏఎస్ లు ఉన్నారా
* రైతుబంధు పేదవాళ్లకు ఇవ్వు..బెంజ్ కారు వారికి కాదు
*దున్నటం రానోడు కార్లల్లో పోయి రైతుబంధు తీసుకుంటే పేద రైతులు ఏం కావాలి
*రైతుబంధు స్కీంని వ్యతిరేకించలే.. కోట్ల ఐటీ కట్టేవాళ్లకే వద్దన్నా
* తెలంగాణ గడ్డపై సంఘాలు, సమ్మెలుండవద్దా
* నన్ను బొందపెట్టాలని చూస్తావా
*ధర్నాచౌక్ ను ఎత్తేసిన చరిత్ర మీది..ఇవన్నీ అడగవద్దా
*రెండేళ్లుగా పెన్షన్లు రాకపోతే సీఎంతో మాట్లాడతా అంటే తప్పా? అదే మా స్థితి
* ముఖ్యమంత్రిని అడిగి నిర్ణయం తీసుకుంటాననడం నా తప్పా
*సొంత కూతురుకు భీ ఫాం ఇచ్చానా ఓడిపోయింది కదా
* సంవత్సరాలు గడుస్తున్నా రేషన్ కార్డులియ్యలేదేం
*మంత్రి పదవి ఇచ్చి బానిసలెక్క బతకమంటే బతుకుతనా
*నీకు దిక్కులేనప్పుడు సాయపడ్డవారు ఇప్పుడు శత్రువులయ్యారా
*హుజురాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ ను గెలిపించా కదా మరిచినవా
*నీది లల్లూప్రసాద్ లాగ కుటుంబం పెట్టిన పార్టీ కాదు... ఇది తెలంగాణ ప్రజల కోసం పెట్టిన పార్టీ
*చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తదని చెప్పిన.. ఇది పార్టీ వ్యతిరేకమా?
*ఐకేపీ సెంటర్లు ఉంటయ్.. వడ్డు కొంటయ్ అని చెప్పిన.. తప్పేమన్న అన్ననా?
*ప్రగతిభవన్ కాదు బానిసల నిలయం..మందుగోలి ఎంపీకి ముఖం మీదే చెప్పా
*ఇంట్లోళ్లు బయటకు వెళ్లారు..బయటోళ్లు గొప్పోళ్లు అయ్యారా
* నీ పార్టీలో ఒక్క మంత్రి స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఉందా
*పదవులు మస్క కొడితే రాలే.. రక్తం చిందించి కొట్లాడితే వచ్చినయ్