రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్  వచ్చే ప్రమాదం ఉంది

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరించే ప్రమాదముందన్నారు మంత్రి ఈటెల రాజేంద్ర ప్రసాద్. సెకండ్ వేవ్ ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్నారు. తెలంగాణలో ఇంకా 65 శాతం కరోనా వ్యాక్సిన్ వేయాలన్నారు. హాస్పిటల్స్ లో నియామకాల భర్తీ త్వరలోనే ఉంటుందన్నారు. గాంధీ- ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న వసతులను మిగిలిన హాస్పిటల్స్ లో కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల వికేంద్రీకరణకు చర్యలు ప్రారంభించామన్నారు.నిలోఫర్ హాస్పిటల్ తరహాలో జిల్లా కేంద్రాల్లో వైద్యం అందేలా చర్యలు చేపడుతామన్నారు. క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.  కుటుంబ నియంత్రణలో దేశ సగటు 2 కి పైగా ఉంటే..తెలంగాణలో 1.6 ఉందన్నారు.