19వేల రెస్టారెంట్లను ప్లాట్​ఫారమ్ నుంచి తొలగించిన జొమాటో

19వేల రెస్టారెంట్లను ప్లాట్​ఫారమ్ నుంచి తొలగించిన జొమాటో

న్యూఢిల్లీ: జొమాటో, బ్లింకిట్ బ్రాండ్ల పేరెంట్​ కంపెనీ ఎటర్నల్, మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ. 39 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్​) సంపాదించింది. ఈ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ జొమాటో క్విక్, ఎవ్రీడే వ్యాపారాలను మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో జొమాటో నుంచి ఎటర్నల్‌‌‌‌గా పేరు మార్చుకుంది. గత సంవత్సరం మార్చి క్వార్టర్​లో రూ. 175 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. డిసెంబర్- ముగింపు క్వార్టర్తో పాటు మార్చి 31, 2025తో ముగిసిన క్వార్టర్, సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఇతర కాలాలతో పోల్చలేమని పేర్కొంది. 

జనవరి–-మార్చి క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా ఎటర్నల్​కు రూ. 5,833 కోట్ల ఆదాయం వచ్చింది. నాలుగో క్వార్టర్లో ఎటర్నల్ మొత్తం ఖర్చు రూ. 6,104 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ. 3,636 కోట్లు.  ఈ క్వార్టర్​లో ఎటర్నల్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌‌‌‌ఫామ్ జొమాటో దాదాపు 19వేల రెస్టారెంట్లను ప్లాట్​ఫారమ్​ నుంచి నుంచి తొలగించింది. ఇవి పరిశుభ్రత ప్రమాణాలను పాటించకపోవడమే కారణం.