60 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నా.. 'ఎటర్నల్ వర్జిన్' సల్మాన్ ఖాన్ సంచలన ప్రకటన!

60 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నా.. 'ఎటర్నల్ వర్జిన్' సల్మాన్ ఖాన్ సంచలన ప్రకటన!

బాలీవుడ్ భాయ్‌జాన్, సల్మాన్ ఖాన్ గురించి అభిమానులకు తెలిసినంతగా మరే నటుడి గురించి తెలియదు. ఆయన సినిమా రికార్డుల గురించి ఎంత చర్చ జరుగుతుందో, ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి అంతే చర్చ జరుగుతుంది. కొన్నేళ్ల క్రితం 'కాఫీ విత్ కరణ్' షోలో స్వయంగా తనను తాను శాశ్వత బ్రహ్మచారిగా ప్రకటించుకుని సంచలనం సృష్టించారు సల్మాన్. అయితే ఇప్పుడు పిల్లలను కనే విషయంపై మరోసారి బోల్డ్ కామెంట్స్ చేశారు.

ఈ ఏడాది డిసెంబర్‌తో 60 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సల్మాన్ ఖాన్.. ఇటీవల కాజోల్, ట్వింకిల్ ఖన్నా నిర్వహించిన 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్‌తో కలిసి వచ్చిన ఈ షోలో సల్మాన్ వ్యక్తిగత విషయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.  తన పెళ్లి, పిల్లలు, దత్తత తీసుకోవడం వంటి వాటిపై సమాధానం చెప్పారు. పిల్లలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 త్వరలోనే నాకు పిల్లలు కచ్చితంగా పుడతారు!

ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా సరదాగా సల్మాన్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు. "మీరు 'ఎటర్నల్ వర్జిన్' కదా" అంటూ పలకరించి.. బహుశా మీకు 12 మంది పిల్లలు ఉండి ఉండవచ్చు. కానీ మీకే తెలియకపోవచ్చు అని నవ్వుతూ జోక్ చేశారు. దీనికి సల్మాన్ తనదైన శైలిలో చమత్కారంగానే రిప్లై ఇచ్చేశారు.  నాకు పిల్లలు ఉంటే మీకు తెలిసి ఉండేది. ఒకవేళ ఉంటే, నాకే ముందు తెలిసేది, వారే వచ్చి చెప్పేవారు అని చెవిలో గుసగుసలాడారు.

 సరోగసీ పద్ధతిలో సల్మాన్ తండ్రి కాబోతున్నారా?

పిల్లల గురించి చర్చ కొనసాగుతుండగా మీకు దత్తత తీసుకునే ఆలోచన ఉందా అని సల్మాన్ ను ట్వింకిల్ సూటిగా అడిగారు. దీనికి సల్మాన్ లేదు అని చెప్పారు. కానీ తాను పిల్లలను కనాలని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నాకు తప్పకుండా పిల్లలు పుడతారు. త్వరలోనే... అని ధీమాగా చెప్పారు.  ఇప్పుడు ఈ ప్రకటనతో బాలీవుడ్ సర్కిల్స్‌లో మరోసారి చర్చ మొదలైంది. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనడానికి సల్మాన్ ఖాన్ సరోగసీ పద్ధతిని ఎంచుకోవచ్చని బాలీవుడ్ లో టాక్ ఫుల్ గా వినిపిస్తోంది.

ఇక పెళ్లి చేసుకోవాలని,  పిల్లలను కనాలని ఎప్పుడైనా తల్లిదండ్రులు ఒత్తిడి చేయలేదా అని సల్మాన్ ని కాజోల్ అడిగింది.  దీనికి సల్మాన్ .. మా నాన్న సలీం ఖాన్, అమ్మ సల్మా ఖాన్ నుండి ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని గానీ, పిల్లలను కనాలని గానీ ఎలాంటి ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు పిల్లలను కనాలని తాను నిర్ణయించుకున్నారు. వారి ఆలనా పాలనను మా కుటుంబం చూసుకుంటుందని చెప్పుకోచ్చారు. మాది చాలా పెద్ద కుటుంబం.. నా పిల్లలకు అండగా ఉంటుందని తెలిపారు. సల్మాన్ ఖాన్ జీవితంలో త్వరలోనే ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం ఉందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..