బెలార‌స్‌పై  ఈయూ ఆంక్ష‌లు

బెలార‌స్‌పై  ఈయూ ఆంక్ష‌లు

ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలనే తపనతో  ఏకంగా యుద్ధానికే పాల్పడుతోంది ర‌ష్యా. ఈ వైఖ‌రిని యావ‌త్తు ప్ర‌పంచం విమ‌ర్శిస్తోంది. ర‌ష్యాతో  మంచి స్నేహం ఉన్న భార‌త్ లాంటి దేశం కూడా యుద్ధం మొద‌లెట్టిన ర‌ష్యాకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. అయితే యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు వేదిక‌ను సిద్ధం చేసిన చిన్న దేశం బెలార‌స్ మాత్రం ర‌ష్యా వైఖ‌రికి మ‌ద్ద‌తు ప‌లక‌డంతో పాటుగా ఏకంగా ర‌ష్యాతో క‌లిసి యుద్ధ రంగంలోకి దిగేందుకు కూడా రెడీ అయ్యింది. ఈ ఫ‌లితంగా ఆ దేశంపై ఆంక్ష‌లు విధించే వరకు వెల్లింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్‌పై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్‌ ప్రెసెడెన్సీ ఇవాళ(బుధవారం )ఓ ప్రకటనలో తెలిపింది. ఆంక్ష‌ల్లో భాగంగా బెలారస్‌పై కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలతో పాటుగా కలప, ఉక్కు, పోటాషియంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా కూడా బెలారస్‌లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్‌ చేసింది.

మరిన్ని వార్తల కోసం..

విద్యార్థుల్ని ముందుగానే ఎందుకు తీసుకురాలే?