
రుద్రమదేవి, శాకుంతలం లాంటి కాస్ట్యూమ్ డ్రామాస్ తర్వాత దర్శకుడు గుణశేఖర్ ఎలాంటి సినిమా చేయనున్నాడా అనే ఆసక్తి నెలకొంది. ఈసారి ఆయన రూటు మార్చారు. యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెరకెక్కించబోతున్నారు. మంగళవారం ఈ మూవీని అనౌన్స్ చేశారు. దీనికి ‘యుఫోరియా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, టైటిల్ లోగోను విడుదల చేశారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ వివరాలను త్వరలో తెలియజేస్తామని చెప్పారు.