డసెల్‌డార్ఫ్: యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఫేవరెట్ ఫ్రాన్స్ ఫుట్‌బాల్ టీమ్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 1–0తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. 38వ నిమిషంలో కిలియన్ ఎంబాపె షాట్‌ను అడ్డుకునే ప్రయత్నంలో ఆస్ట్రియా ఆటగాడు వొబెర్ చేసిన సెల్ఫ్ గోల్‌తో ఫ్రాన్స్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా ప్లేయర్ కెవిన్ డాన్సోను ఢీకొని ఎంబాపె ముక్కుకు తీవ్ర గాయమైంది. దాంతో తర్వాతి మ్యాచ్‌ల్లో అతను పాల్గొనడంపై అనుమానాలు మొదలయ్యాయి.
