హైదరాబాద్, వెలుగు: టీవీఎస్ శ్రీచక్ర లిమిటెడ్‌కు చెందిన బ్రాండ్ యూరోగ్రిప్ టైర్స్ హైదరాబాద్‌లో ఐదు కొత్త ప్రత్యేక రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. వీటిలో మూడు స్టోర్లను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఫ్రాంచైజీ పద్ధతిలో ఏర్పాటు చేశారు. యూరోగ్రిప్- మిలాన్ డిజైన్ హెడ్ మిస్టర్ సిల్వియో మొంటానారి ఈ స్టోర్లను ప్రారంభించారు.
దేశవ్యాప్త రిటైల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్ మార్కెట్‌కు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని టీవీఎస్ శ్రీచక్ర లిమిటెడ్ సీఓఓ టీకే రవి తెలిపారు. ఈ సరికొత్త ఔట్‌లెట్లు కేవలం టైర్ల విక్రయాలకే పరిమితం కాకుండా, టూవీలర్లకు సంబంధించి అన్ని రకాల సర్వీసులను అందిస్తాయని ఆయన వివరించారు.
