మూడు నెలల తర్వాత తెరుచుకున్న యూరప్ బార్డర్లు

మూడు నెలల తర్వాత తెరుచుకున్న యూరప్ బార్డర్లు
  • మూడునెలల తర్వాత టూరిస్టులకు అనుమతి
  •  రిస్ట్రిక్షన్స్ అమలు చేస్తున్న కొన్ని దేశాలు
  •  టూరిజం పుంజుకుంటుందని ఆశాభావం

కరోనా కారణంగా మూతపడిన యూరప్ దేశాల బార్డర్లు మూడు నెలల తర్వాత సోమవారం ఓపెన్ అయ్యాయి. యూరప్ యూనియన్ లోని 27 దేశాల్లోని ప్రజలు పాస్ పోర్టు లేకుండానే ప్రయాణించే అవకాశం ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ అమలులో ఉంటాయని కొన్ని దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం అమెరికన్లు, ఆసియన్లు, ఇతర ఇంటర్నేషనల్ టూరిస్టులను అనుమతించేది లేదని స్విట్జర్లాండ్ తోపాటు మరి కొన్ని దేశాలు చెబుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ బార్డర్ లో సోమవారం తనిఖీలను నిలిపివేశారు. ఇటలీ కూడా తన బార్డర్ ను ఓపెన్ చేసింది. పారిస్ బార్డర్స్, రెస్టారెంట్ల రీఓపెన్ సందర్భంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రాన్ మాట్లాడుతూ.. ‘మన స్వేచ్ఛను మళ్లీ వెతుక్కోవాల్సిన సమయం ఇది. దీని అర్థం వైరస్ మాయమైపోయిందని కాదు. ఈ సమ్మర్ ఇది వరకు ఉన్నసమర్ లాగే ఉంటుంది’ అని అన్నారు. ఇప్పటికీ కరోనా మన మధ్యలోనే ఉందని, ముప్పు పూర్తిగా తొలగిపోలేదని స్పానిష్ ప్రైమ్ మినిస్ట ర్ షెడ్రో షాంచెజ్ అన్నారు. క్రిటికల్ మూమెంట్ లోనూ బార్డర్లను రీఓపెన్ చేస్తున్నామని చెప్పారు. టూరిజం మళ్లీపుంజుకోవాల్సి ఉందన్నా రు. ట్రయల్ రన్ లో భాగంగా వేలాది మంది జర్మ న్లు బలియారిక్ ఐలాండ్స్ కు వెళ్లేందుకు స్పెయిన్  అనుమతించింది. టూరిస్టులకు 14 రోజుల క్వారంటైన్ ను సడలించింది. గ్రీస్ లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. గ్రీస్ లో ప్రయాణించడం టూరిస్టులకు సేఫ్ అనే భావన కలిగించాలని గ్రీస్ ప్రధాని కిరియాకోస్ అన్నారు. డెన్మార్క్ నుంచి టూ రిస్టులను జర్మనీ అనుమతించింది. స్వీడన్ తో ఉన్న బార్డర్లను నార్వే, డెన్మార్క్ మూసివేశాయి. బ్రిటన్ నుంచి వచ్చేవారు సెల్ఫ్ క్వారంటైన్ కావాలని ఫ్రాన్స్ కోరింది. కొన్ని దేశాలు బ్రిటన్ టూరిస్టులకు అనుమతిలేదని చెప్పాయి. యూరప్ లోని 16 దేశాలకు ప్రయాణించవచ్చని డచ్ గవర్నమెంట్ తన ప్రజలకు అనుమతించింది.