పాస్ పోర్టు లేకుండానే యూరప్ వైబ్స్..హాలీడే స్పాట్ AR తంగకొట్టై

పాస్ పోర్టు లేకుండానే యూరప్ వైబ్స్..హాలీడే స్పాట్ AR తంగకొట్టై

నిత్యం బిజిబిజీగా గడిపే లైఫ్ నుంచి విశ్రాంతి కోరుకుంటున్నారా..నగర జీవితం నుంచి దూరంగా రీఫ్రెష్​ అయ్యేందుకు టూర్​ ప్లాన్​ చేసుకుంటున్నారా.. రాజభవనాలు, చారిత్రక నగరాలు, ప్రకృతి సౌందర్యం, ఆహ్లాదకరమైన వాతావరణం, విభిన్న సంస్కృతుల సమ్మేళనం వంటి యూరప్​ వైబ్స్​ ను తలపించే అనేక దృశ్యాలను ఒకే చోట చూడాలనుకునే వారికి.. స్పెషల్  హాలిడేస్పాట్​ AR తంగకట్టై.. 

తంగ కొట్టై (A.R.Thanga Kottai) తమిలనాడులోని ఏలగిరిలో ఉన్న ఒక రాయల్, లగ్జరీ ప్యాలెస్ థీమ్ రిసార్ట్. ఇది రాజభవనం లాంటి అనుభూతినిస్తుంది.అద్భుతమైన నిర్మాణం, విలాసవంతమైన గదులు, పెద్ద స్విమ్మింగ్ పూల్, సంప్రదాయం, ఆధునికాల కలయికతో కుటుంబాలు ,కపుల్స్​ కు అద్భుతమైన వీకెండ్ గెట్‌వే. ఇక్కడ అందమైన ఫోటో స్పాట్‌లు, సరదా కార్యకలాపాలతో మరపురాని అనుభూతినిస్తుంది. 

తమిళనాడులోని యెలాగిరికొండలలో ఉన్న AR తంగా కొట్టై (AR Thanga Kottai) అనేది దక్షిణ భారతదేశ సంప్రదాయ శైలిలో నిర్మించబడిన ఒక 5 స్టార్ పాలెస్ హోటల్. ఇది రాజభోగ అనుభూతినిస్తుంది. విలాసవంతమైన గదులు, ప్రైవేట్ పూల్ విల్లాలు, స్థానిక వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తుంది. బిజీ లైఫ్​ నుంచి విశ్రాంతి కోరుకునే వారికి సాంస్కృతిక అనుభవం కోసం కోరుకునే వారికి ఈ ప్లేస్​ చాలా ప్రసిద్ది. 

ఇక్కడి పరిసరాలు, వాతావరణం కట్టడాలు.. యూరప్ దేశాలలోని చారిత్రక నగరాలు, ప్రకృతి సౌందర్యం, విభిన్న సంస్కృతుల సమ్మేళనం, అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, వంటి ప్రత్యేకమైన జీవనశైలి అనుభూతిని కలిగిస్తాయి. 
వైబ్స్​ అనుభూతులు.. 

రాయల్ & లగ్జరీ అనేది క్వీన్ ఆఫ్ హిల్ రిసార్ట్ గా పిలుస్తారు. నిజంగా బంగారు కోటలో ఉన్న అనుభూతినిస్తుంది. అంతా విలాసవంతంగా ఉంటుంది.యూరోపియన్​ స్టైల్ స్యూట్​ లు, అగ్రహారం స్టైల్​ ఇండ్లు, సంప్రదాయ డిజైన్లతో మిలితమై ఉంటాయి.

ఇక ఫ్యామిలీతో గడిపేందుకు మంచి హాలీడే స్పాట్​.. పిల్లలకు స్మిమ్మింగ్​ పూల్​, ప్లే గ్రౌండ్స్​ వంటి సౌకర్యాలతో ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

ఫోటోషూట్​ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు  ఉన్నాయి. అద్బుతమైన ఆర్కిటెక్చర్,రకరకాల డిజైన్లతో ప్రతిచోట ఫొటోలు క్లిక్​ మనిపించేందుకు అనువుంగా అద్బుతమైన స్పాట్​ లు ఉన్నాయి. బిజీ లైఫ్​ నుంచి విశ్రాంతి కోరుకునేవారికి ప్రశాంతమైన వాతావరణం, విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. 

మొత్తంగా తంగకొట్టై అనేది సంప్రదాయ, విలాసవంతమైన కుటుంబ వినోదాల కలయికతో  ఏలగిరి  మరచిపోలేని అనుభూతినిచ్చే  ఓఅద్బుతమైన హాలిడే స్పాట్​ గా పర్యాటకులకు యూరప్​ వైబ్స్​ తో అద్బుతమైన అనుభూతిని  అందిస్తుంది.