స్కూళ్లు తెరిచి రెండు నెలలైనా నిధులు ఇవ్వని ప్రభుత్వం 

 స్కూళ్లు తెరిచి రెండు నెలలైనా నిధులు ఇవ్వని ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను ప్రభుత్వం గాలికి వదిలేసింది. బడులు తెరిచి రెండు నెలలైనా నయా పైసా ఇవ్వలేదు. బడిబాట నుంచి ప్రస్తుతం నిర్వహిస్తున్న వజ్రోత్సవాల ఖర్చులన్నీ హెడ్మాస్టర్లే భరిస్తున్నారు. నెలనెలా జీతాల్లేక అవస్థల్లో ఉన్న వారికి, బడి నిర్వహణ మరింత భారంగా మారింది. కనీసం పంద్రాగస్టుకైనా నిధులొస్తాయనే ఆశతో ఉన్న వారికి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. రాష్ట్రంలో 26 వేల సర్కారు స్కూళ్లుండగా, వీటిలో 30 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఇందులో విద్యార్థులున్న 24,852 బడులకు రెండు విడతల్లో మెయింటెనెన్స్ కోసం గ్రాంట్స్ ఇస్తుంటారు. స్టూడెంట్ల సంఖ్యను బట్టి ఏటా రూ.12,500, రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.75 వేలు, రూ.లక్ష ఇలా ఐదు స్లాబుల్లో నిధులు కేటాయిస్తారు. అయితే గత విద్యా సంవత్సరం చివర్లో కొత్త ఖాతాలు తీస్తున్నామని, సింగిల్ నోడల్ ఏజెన్సీ కింద అన్ని ఖాతాలను తెస్తున్నామని చెప్పి అన్ని స్కూళ్లలోని బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయించారు. వాటిలో ఉన్న నిధులను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు లాగేసుకున్నారు. దీంతో బడుల్లో ఒక్కపైసా కూడా లేకుండా పోయింది. 

బడిబాటకు ఇవ్వలే.. రిపేర్లకూ ఇవ్వలే..

రాష్ట్రంలో జూన్ 3 నుంచి 30 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. దీనికి ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. కరోనా తర్వాత బడులు తెరుచుకోవడంతో సానిటరీ ఐటెమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కొత్త విద్యా సంవత్సరం కావడంతో స్టేషనరీ వస్తువులతో పాటు చాక్ పీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రిజిస్టర్లు కూడా అవసరం. దీనికితోడు క్లీనింగ్, రిపేర్లు, కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు.. ఇలా అన్ని రకాల అవసరాలకు హెడ్మాస్టర్లు, కొందరు టీచర్లు సొంత డబ్బులు పెట్టుకున్నారు. జీతం కూడా 1న రాకపోవడంతో, అప్పులు చేసి బడుల్లో ఖర్చులు పెడుతున్నారు. 

వజ్రోత్సవాలకూ పైసా రాలే..

ఈ నెల 8 నుంచి 22 వరకు అన్ని బడుల్లో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని సర్కారు ఆదేశించింది. కానీ ఇప్పటికీ నిధులు ఇవ్వలేదు. ఈ కార్యక్రమం కోసం స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.4.92 కోట్లు బడ్జెట్ ఇస్తున్నట్టు రెండ్రోజుల కింద విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ జీవో ఇచ్చినా ఇప్పటి వరకు స్కూళ్లకు పైసా రాలేదు. పంద్రాగస్టుకైన ప్రభుత్వం నిధులు ఇస్తుందన్న గ్యారంటీ లేదు. 

ఖర్చులు మేమే భరిస్తున్నం

సిద్దిపేట మండలం పుల్లూరు జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 130 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఏటా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేల నిర్వహణకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చవుతుంది. ఈ ఏడాది పంద్రాగస్టు అలంకరణ ఖర్చులు, పిల్లలకు స్వీట్లు, ఆటపోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలి. కానీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక నిధులు లేకపోవడంతో వాటిని మేమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‌‌‌‌
‑ హెచ్ఎం ఇందిరా రాణి 

గ్రాంట్స్ వెంటనే ఇవ్వాలె.. 

విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైంది. అయినా స్కూళ్లకు గాని, ఎంఆర్సీలకు గాని నిధులు రాలేదు. కరెంట్ బిల్లుల నుంచి నిర్వహణ ఖర్చులన్నీ హెడ్మాస్టర్లే పెట్టుకోవాల్సి వస్తోంది. పంద్రాగస్టుకు, వజ్రోత్సవాల నిర్వహణకూ హెడ్మాస్టర్లే అప్పులు చేసి ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కూల్ గ్రాంట్స్ రిలీజ్ చేయాలి. 
- ఆర్.రాజ్ గంగారెడ్డి, గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

జెండా ఖర్చులు జేబు నుంచి పెట్టుడే..

జెండా వందనం రోజు ఖర్చులను జేబు నుంచే భరించాల్సి వస్తోంది. బడుల్లోని హెడ్మాస్టర్, ఎస్ఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన జాయింట్ ఖాతాలు క్లోజ్ చేసి, ఆ ఖాతాలోని మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశాం. దీంతో ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల నిర్వహణ, జెండా పండుగల ఖర్చులు జేబులోంచి ఇవ్వాల్సి వస్తోంది. కరెంట్ బిల్లు లాంటి ఖర్చులకూ డబ్బుల్లేక అనేక మంది టీచర్లు, హెడ్మాస్టర్లు అవస్థలు పడుతున్నారు.  - ఎ. భోజ్యానాయక్, హెడ్మాస్టర్, పీఎస్ ములుగుపల్లి, భూపాలపల్లి జిల్లా