
రాష్ట్ర అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టం బిల్లును ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటుందో అన్న వివరాలను ఆయన అసెంబ్లీలో వివరించారు. చట్టం ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు.
పట్టణాల అభివృద్ధి కోసం కేటాయించే నిధుల్లో 10 శాతం నిధులు గ్రీనరీ పెంచేందుకే ఖర్చు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన ఇంటి నంబర్ ఇస్తామన్నారు. QR కోడ్ తో ఆ ఇంటినంబర్ ఉంటుందని చెప్పారు. నేరాలను అదుపుచేయడం కూడా సులభం అవుతుందని చెప్పారు సీఎం కేసీఆర్.