
=మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : కరోనా పై దేశ ప్రజలంతా యుద్ధం చేస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఈ పోరాటంలో ప్రతి భారతీయుడు ఓ సైనికుడేనని చెప్పారు. కొందరు పేదలకు ఆహారం ఇస్తుండగా, కొందరు మాస్క్ లు కుడుతున్నారు. మరొకొందరు తమ భూములు అమ్మి డబ్బులు ఇస్తున్నారు. దేశ ప్రజలెవరు ఆకలితో ఉండకుండా రైతులు కష్టపడుతున్నారని చెప్పారు. ప్రజలే నాయకత్వం వహిస్తూ చేస్తున్న ఈ పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రధాని చెప్పారు. 64 మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా పై దేశ ప్రజలు చేస్తున్న పోరాటం, ప్రభుత్వం తరఫున చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనం స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. విపత్తు సమయంలో రాష్ట్రాలతో కలిసి కేంద్రం పనిచేస్తుందన్నారు. కష్ట సమయంలో డాక్టర్లు, హెల్త్ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని మహమ్మారిని తరిమికొట్టిన తర్వాత జీవితం కొత్తగా ఉంటుందన్నారు ప్రధాని. ప్రధాని మాట్లాడిన మరిన్ని మాటలు
- Covidwarriors.gov.in – వైబ్ సైట్ లో డాక్టర్లు, నర్సులు సహా 1.15 కోట్ల మంది ప్రజలు చేరారు. పోర్టల్‌లో చేరి కరోనా ను తరిమికొట్టే యోధుడు కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
- దేశం ఇతర దేశాలతో మందులు పంచుకోవాల్సిన అవసరం లేని సమయం ఇది. అయినా సొంత ప్రయోజనాలకు అతీతంగా వ్యవహరించి అన్ని దేశాలకు మందులు సప్లయ్ చేశాం. ప్రతి ఒక్కరి అవసరాలును గుర్తించి మానవతాధృక్పథంతో వ్యవహారించాం. ఇతర దేశాల నాయకులతో మాట్లాడినప్పుడు వారంతా మన దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
- యోగా, ఆయుర్వేదం శక్తి ని ప్రపంచమంతా గుర్తించింది. ఆయుర్వేద మందుల శక్తి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
- కరోనా తో కారణంగా ఉమ్మివేయడం ఎంత చెడ్డ అలవాటో అందరికీ అర్థమైంది. కాబట్టి ఈ అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాలి. ఇది పరిశుభ్రతను పెంచుతుంది.
- గతేడాది రంజాన్ జరుపుకునేప్పుడు ఈ ఏడాది రంజాన్ నాటికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈద్ నాటికి ప్రపంచం కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాలని ప్రార్ధిద్దాం.
- ఫిజికల్ డిస్టెన్స్ తో కొనసాగించాల్సి సమయం ఇది. మనమంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
- కరోనా వారియర్స్ పై దాడి చేసే వారిపై కఠినంగా వ్యవహారించేందుకు తెచ్చిన చట్టంపై ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది.