గూగుల్ మెచ్చిన డూడుల్ హీరో

గూగుల్ మెచ్చిన డూడుల్ హీరో

గూగుల్ హోమ్ పేజ్ కోసం ‘డూడుల్ ఫర్ గూగుల్’ పేరుతో  ప్రతీ సంవత్సరం డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంటుంది గూగుల్. ఈ సంవత్సరం నిర్వహించిన పోటీల్లో వెస్ట్ బెంగాల్ కి చెందిన కుర్రాడు శ్లోక్ ముకర్జీ గెలిచి, గూగుల్ ప్రశంసలు అందుకున్నాడు. అతను గీసిన చిత్రాన్ని ఇవ్వాల (నవంబర్ 14)న గూగుల్ డూడుల్ గా పెట్టారు.

దేశంలోని ప్రధాన నగరాలనుంచి ఒక లక్షా పదిహేను మంది పోటీకి వచ్చారు. వాళ్లందరినీ దాటుకొని శ్లోక్ గీసిన చిత్రం గెలిచి, గూగుల్ హోమ్ పేజ్ కి సెలక్ట్ అయింది. ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్కూల్ లో చదువుతున్న శ్లోక్, తను గీసిన చిత్రం గురించి ఇలా రాసుకొచ్చాడు, “రాబోయే 25 ఏండ్లలో నా భారతదేశ శాస్త్రవేత్తలు మానవాళి అభివృద్ధి కోసం పర్యావరణ అనుకూల రోబోట్‌లను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుండి అంతరిక్షానికి క్రమం తప్పకుండా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలు జరుగుతాయి. భారతదేశం యోగా, ఆయుర్వేద రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే సంవత్సరాల్లో దేశం ఆర్థికంగా, సాంకేతికంగా మరింత బలపడుతుంది’’. తన ఆలోచనల్ని గూగుల్ డూడుల్ రూపంలో గీసి మొదటి బహుమతి గెలుచుకున్నాడు.