కాలేజీలు,వర్సిటీలు బంద్​.. ఆన్ లైన్ చదువులే

కాలేజీలు,వర్సిటీలు బంద్​.. ఆన్ లైన్ చదువులే

న్యూఢిల్లీకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మొదట విద్యాసంస్థలను మూసివేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ ప్రకటించింది. ఈ దెబ్బకు పిల్లల చదువులు ఎలా అని పేరెంట్స్ తెగ హైరానా పడిపోయారు. ఇప్పుడు వారి చదువులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా.. చాలా ఇన్‌‌స్టిట్యూషన్స్ ఆన్‌‌లైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. టెక్ కంపెనీల సాయంతో ఈ కోర్సులను అందిస్తున్నాయి.లెక్చరర్స్‌‌ జూమ్, గూగుల్ హ్యాంగ్‌‌ అవుట్స్ వంటి  వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌‌ల ద్వారా ఆన్‌‌లైన్ కోర్సులను అందిస్తున్నారని, కొందరు ప్రొఫెసర్స్ యూట్యూబ్‌‌లో ట్యుటోరియల్స్‌‌ను అప్‌‌లోడ్ చేస్తున్నారని ఓ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి చెప్పారు. టెక్ట్స్‌‌ లను కూడా ఓపెన్ బుక్ ఫార్మాట్‌‌లో కండక్ట్ చేస్తున్నారని, ప్రతి విద్యార్థికి, వేరువేరు సెట్స్‌‌ తో క్వశ్చన్ పేపర్స్‌‌ సిద్ధం చేస్తున్నారని తెలిపారు

. ఒకప్పుడు వీడియో కాన్ఫరెన్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీల మీటింగ్సే. కానీ ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌‌ ల ద్వారా విద్యార్థులకు చదువు చెబుతున్నారు. అలాగే ఆన్‌‌లైన్‌‌లో టెస్ట్‌‌ లు ఇన్ని రోజులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌‌ కే పరిమితమై ఉండేవి.ఇప్పుడు వాటి స్ట్రక్చర్ కూడా మారిపోయి, స్కూల్ పిల్లల ఎగ్జామ్స్‌‌ ను కూడా ఆన్‌‌లైన్‌‌లోనే కండక్ట్ చేస్తున్నారు లెక్చరర్స్. విద్యార్థులు కూడా  ఎప్పుడు కావాలనుకుంటే, అప్పుడు చదువుకునేలా ఈ ఆన్‌‌లైన్ కోర్సుల ఫార్మాట్లు ఉండటంపై హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే దేశమంతా లాక్‌‌డౌన్ కొనసాగుతుండటంతో.. మెజార్టీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో నెట్‌‌వర్క్స్‌‌ లో సమస్యలు వస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. అయితే బ్యాక్‌‌గ్రౌండ్ నాయిస్ అనేది ఇటు విద్యార్థులకు, అటు టీచర్లకు ప్రాబ్లమ్‌‌గా మారింది. ‘నేను ఫైనల్ సెమిస్టర్‌‌‌‌లో ఉన్నాను. ఈ సమయంలో మా సూపర్ వైజర్‌‌‌‌తో ఎప్పటికప్పుడు ఫేస్ టూ ఫేస్ ఇంటరాక్ట్ అవుతూ.. థీసిస్‌‌ను రాయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు నాకు ఛాలెంజ్‌‌గా మారింది’ అని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన సిద్ధాంత్ హీరా చెప్పారు.

దేశమంతా లాక్‌‌డౌన్‌‌తో ఇన్‌‌స్టిట్యూషన్లు ఆన్‌‌లైన్ ద్వారానే టీచింగ్ చేపడుతుండటంతో.. టెక్నాలజీ కంపెనీలు కూడా వీటికి సహకరిస్తున్నాయి. గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరి టీచ్ ఫ్రమ్ హోమ్‌‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఆన్‌‌లైన్ క్లాసెస్‌‌ను ఎలా కండక్ట్ చేయాలో ఎడ్యుకేటర్లకు తెలియజేస్తూ… ఇన్‌‌ఫర్మేషన్ హబ్‌‌గా ఉంది. అదేవిధంగా జూలై 1 వరకు తమ జీ స్యూట్ కస్టమర్లందరికీ వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం హ్యాంగ్ అవుట్స్ యాక్సస్‌‌ను ఉచితంగా అందిస్తున్నట్టు గూగుల్ చెప్పింది.  లెక్చరర్స్ కూడా ఇంటరాక్టివ్ క్విజ్‌‌లను డిజైన్ చేయడం, స్మాల్ సెషన్స్‌‌ ను ప్లాన్ చేయడం, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చేపట్టడం ద్వారా విద్యార్థులను చేరుకుంటున్నారని గూగుల్ సౌత్‌‌ ఏషియా ఎడ్యుకేషన్ హెడ్ బని ధావన్ చెప్పారు. ఖాన్ అకాడమీ అయితే మ్యాథ్స్, సైన్స్, ప్రొగ్రామింగ్ వంటి సబ్జెట్లను ఉచితంగా అందిస్తోంది. గత వారం నుంచి తాము టీచర్లు, పేరెంట్స్, స్టూడెంట్ల కోసం పలు రిసోర్స్‌‌ ను క్రియేట చేసినట్టు ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ సందీప్ బాప్న చెప్పారు. ఖాన్ అకాడమీకి యూజర్లు పెరిగిపోయారన్నారు. పేరెంట్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయన్నారు.

కరోనాకు ఇన్సురెన్స్ వర్తిస్తది