'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ షూటింగ్‌కు సర్వం సిద్ధం

'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ షూటింగ్‌కు సర్వం సిద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణం వచ్చినట్టే తెలుస్తోంది. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు సర్వం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కారణం తాజాగా మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీటే. పవన్ కళ్యాణ్ సినిమాకు అంతా రెడీ అయినట్టు ఈ నిర్మాణ సంస్థ పేర్కొంది. దాంతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ బోస్ లను ట్యాగ్ చేస్తూ.. సెట్ లో ఉన్న వారి ఫొటోలను కూడా షేర్ చేశారు. దీంతో తాము ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న పవన్ మూవీ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ డైరెక్టర్ హరీష్‌ శంకర్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు భగవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఇంతకుమునుపే ప్రకటించి, ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా షూటింగ్ మాత్రం ఇప్పటికీ ముందుకు కదల్లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒప్పుకోవడం, వాటిని పూర్తి చేసుకోవడమే సరిపోయింది. దీంతో గత నాలుగైదేళ్లుగా ఎదురుచూస్తున్న హరీశ్ శంకర్ కు నిరాశే మిగిలింది. ఇక ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కనుండడంతో లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.