RamCharan Bouncer: రామ్ చరణ్కు బౌన్సర్‌గా మారిన కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌.. ఫోటోలు వైరల్

RamCharan Bouncer: రామ్ చరణ్కు బౌన్సర్‌గా మారిన కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌.. ఫోటోలు వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు వరల్డ్ వైడ్గా స్పెషల్ క్రేజ్ ఉంది. ఇటీవల లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ వద్ద తన మైనపు విగ్రహాన్ని రామ్ చరణ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్కు రామ్ చరణ్ రాగానే పెద్దఎత్తున అభిమానులు ఆయనకు  స్వాగతం పలికారు. ఇలా లండన్ పర్యటనలో భాగంగా మంగళవారం మే13న రామ్ చరణ్ను మాజీ బ్రిటిష్ హెవీ వెయిట్ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్‌ కలిశాడు.

అయితే, ఆ ఈవెంట్‌లో బౌన్సర్‌గా కూడా పనిచేసిన మాజీ బాక్సర్, చరణ్‌ను తన భుజంపై బాక్సింగ్ బెల్ట్ పెట్టి గౌరవించమని కోరారు. ఈ సందర్భంగా జూలియస్ ఫ్రాన్సిస్‌ను చరణ్ సత్కరిస్తున్న ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. దాంతో ప్రపంచదేశాల ఫ్యాన్స్ చరణ్ మంచి మనసుని, తన స్నేహభావాన్ని ప్రశంసిస్తున్నారు.

Also Read  : ‘కింగ్‍డమ్’ రిలీజ్ వాయిదా

ఇకపోతే, బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్‌ విషయానికి వస్తే..  బ్రిటిష్‌ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌గా 5 సార్లు, కామన్వెల్త్‌ ఛాంపియన్‌గా 4 సార్లు సత్తా చాటారు.

రామ్ చరణ్ హిస్టరీ:

రామ్ చరణ్ ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ కూడా ఈ మైనపు బొమ్మలో కలిసి ఉండటం విశేషం. దాంతో క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత అంతటి ప్రాధాన్యత సాధించుకున్న స్టార్‌గా రామ్ చరణ్ నిలిచారు. ఈ ఐకానిక్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న రెండో వ్యక్తిగా రామ్ చరణ్ నిలిచారు. ఫస్ట్ యాక్టర్ ఆయనే.

మేడమ్ టుస్సాడ్స్‌లో ఎవరెవరివీ ఉన్నాయంటే?

సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హీరోయిన్ కాజోల్, దర్శకనిర్మాత కరణ్ జోహార్ వంటి దిగ్గజ భారతీయ సినీ తారల బొమ్మలు ఉన్నాయి.

అంతేకాదు లండన్‌లో జరిగిన 2000 IIFAలో అమితాబ్ బచ్చన్ బొమ్మను ఆవిష్కరించి 25 ఏళ్లు పూర్తవుతున్నందున.. భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి ప్రభావాన్ని చూపిస్తూ ఈ భాగస్వామ్యం పెరుగుతూనే వస్తోంది. కాగా క్వీన్ ఎలిజబెత్ II కాకుండా, పెంపుడు జంతువును కలిగి ఉన్న ఏకైక సెలబ్రిటీగా రామ్ చరణ్ ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది.