KINGDOM: అఫీషియల్.. ‘కింగ్‍డమ్’ రిలీజ్ వాయిదా.. నితిన్ ‘తమ్ముడ్ని’ లాక్కున్న దేవరకొండ

KINGDOM: అఫీషియల్.. ‘కింగ్‍డమ్’ రిలీజ్ వాయిదా.. నితిన్ ‘తమ్ముడ్ని’ లాక్కున్న దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‍డమ్’ (KINGDOM). భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలున్నాయి.

కింగ్‍డమ్ మూవీ మే 30న విడుదలకు సిద్దమవుతున్న వేళ.. మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాను 2025 జూలై 4కి పోస్ట్ ఫోన్ చేస్తున్నాం అంటూ సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నేడు (మే14న) సోషల్ మీడియా వేదికగా స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. 

"ప్రియమైన ప్రేక్షకులకు.. మా సినిమా ‘కింగ్‍డమ్’ విడుదల మే 30న జరగాల్సి ఉండగా.. జూలై 4 వరకు వాయిదా పడిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాము. అసలు మొదట నిర్ణయించిన తేదీకి విడుదల చేయాలనీ కట్టుబడి ఉంటూ వచ్చాం. కానీ దేశంలో (ఇండియా-పాక్ యుద్ధం) ఇటీవల ఊహించని సంఘటనలు మరియు ప్రస్తుత వాతావరణం కారణాల చేత ప్రమోషన్లు చేయలేకపోతున్నాం. సినిమా ఈవెంట్స్ జరిపలేకపోతున్నాం..కనుకే విడుదల వాయిదా వేస్తున్నాం " అంటూ X వేదికగా పోస్ట్ పెట్టారు. ఇకపోతే ఈ మూవీ జూలై 4 తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ కానుంది.

నితిన్ ‘తమ్ముడ్ని’లాక్కున్న దేవరకొండ:

‘వకీల్‌‌‌‌‌‌‌‌ సాబ్‌‌‌‌‌‌‌‌’ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘తమ్ముడు’. నితిన్ కచ్చితంగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ వచ్చారు నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్. సోలో డేట్ సెలెక్ట్ చేసుకుని.. మంచి హిట్ కొట్టాలని అనుకున్నారు.

అందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు. అయితే, ఎలాగైనా జులై 4న విడుదల చేసేందుకు గట్టిగా ప్లాన్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసుకున్నారు. కానీ, ‘కింగ్‍డమ్’ రాకతో నితిన్ తమ్ముడు సైడ్ అయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్గా ‘కింగ్‍డమ్’ వాయిదా నోట్లో కూడా నిర్మాత దిల్ రాజు, నితిన్కు స్పెషల్ థ్యాంక్స్ అంటూ వెల్లడించారు. దాంతో నితిన్ తమ్ముడు మరోసారి వాయిదా పడినట్టే! అని టాక్ మొదలైంది.