ముంబైలో బతకడం సేఫ్ కాదు.. మాజీ సీఎం భార్య

ముంబైలో బతకడం సేఫ్ కాదు.. మాజీ సీఎం భార్య

అమాయకులు, సెల్ప్ రెస్పెక్ట్ ఉన్న వాళ్లు ముంబైలో బతకడం సేఫ్ కాదని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్ ట్వీట్ చేసింది. బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచార‌ణ చూస్తుంటే.. ముంబైలో మాన‌వ‌త్వం చ‌చ్చిపోయిందేమో అనిపిస్తుందని ఆమె ట్వీట్ లో పేర్కొంది. ముంబై పోలీసులు కేసుని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆమె వ్యంగంగా అన్నారు. ఇప్పడు ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

అమృత వ్యాఖ్యలపై శివ‌సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది ఘాటుగా స్పందించారు. మీ రాజకీయం కోసం ముంబై పోలీసులను తప్పుబట్టడం కరెక్ట్ కాదు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడేవాళ్లకు నా సూచన. మీరు మీ పోలీస్ భద్రతను వదిలి.. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను పెట్టుకొండి. ఒక మాజీ సీఎం భార్య పోలీసుల గురించి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు’అని ఆమె అన్నారు.

సుశాంత్ మ‌ర‌ణంపై అనేక అనుమానాలు మరియు పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు పట్ల సంతృప్తి చెందని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవిస్.. కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ విచారించాలని కోరారు. సుశాంత్ డ‌బ్బును భారీ మొత్తంలో అక్ర‌మంగా వాడుకున్న‌ట్లు తెలుస్తోందని ఆయ‌న అన్నారు.

For More News..

కర్ణాటక మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

ప్రముఖ కళాకారుడు వంగపండు మృతి