ఎమ్మెల్యేగా కల్పనా సోరెన్ విజయం

ఎమ్మెల్యేగా కల్పనా సోరెన్ విజయం

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌‌‌‌ సోరెన్‌‌ భార్య కల్పనా సోరెన్ గండీ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి పోటీ చేసిన కల్పన  బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ పై 27,149 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో గండీ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది. మే 20న ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా 3.16 లక్షల ఓటర్లకు గాను 2.17 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.