Tsunami warning: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ

Tsunami warning: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ

అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం (మే 2) చిలీ, అర్జెంటీనా దక్షిణ తీరాలలో రిక్టర్ స్కేల్ పై 7.4తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ క్రమంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అర్జెంటీనాలోని ఉషుయాకు దక్షిణాన దాదాపు 219 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రేక్ పాసేజ్ లో 10కిలోమీటర్లో లోతులో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 

భూకంపం తర్వాత ప్రమాదకరమైన సునామీ అలలు రావొచ్చని యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలను సునామీ అలల ప్రభావితం చేయొచ్చని తెలిపింది. 

సునామీ హెచ్చరికలతో చిలీ తీర ప్రాంతాన్ని అలెర్ట్ చేశారు. చిలీలోని ప్యూర్టో విలియమ్స్ తాకొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మాగల్లెన్స్ ప్రాంతంలోని తీర ప్రాంత ప్రజలను తరలించాలని చిలీ జాతీయ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. చిలీ అంటార్కాటిక్ భూభాగంలోని బీచ్ ప్రాంతాలను కూడా ఖాళీ చేయాలని కోరింది.