నల్డొండ సభకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్

నల్డొండ సభకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్

నల్లగొండలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని  ప్రాజెక్టులపై అధికారాన్ని వదలులుకొని తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఛలో నల్లగొండకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో పాల్గొనేందుకు కొద్దిసేపటిక్రితం హెలికాప్టర్ లో కేసీఆర్ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.

 అంతుకుముందు హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు, కేటీఆర్ తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ప్రత్యేక బస్సుల్లో నల్లగొండ సభకు చేరుకున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. మరికొద్దిసేపట్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు.