12 క్వింటాళ్ల మటన్.. 40 క్వింటాళ్ల చికెన్ : దత్తన్న అలాయ్ బలాయ్ అంటే ఆ మాత్రం ఉంటది..!

12 క్వింటాళ్ల మటన్.. 40 క్వింటాళ్ల చికెన్ : దత్తన్న అలాయ్ బలాయ్ అంటే ఆ మాత్రం ఉంటది..!

దసరా తర్వాత రోజు దత్తన్న అలాయ్ బలాయ్ అంటే అందరికీ ఓ ఎమోషన్. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఒక్క చోట చేర్చి.. దత్తన్న ఇచ్చే ఆతిధ్యం అదరహో.. ప్రతి ఏటా అలాయ్ బలాయ్ ఫుడ్ వెరైటీలు ఆకర్షిస్తూనే ఉంటాయి. ఈ ఏడాది అదే రేంజ్ లో తన మెనూ ప్రిపేర్ చేశారు దత్తన్న..

40 క్వింటాళ్ల చికెన్.. అంటే 4 వేల కేజీల చికెన్. ఇది మామూలు విషయమా ఏంటీ.. అతిధుల కోసం 4 వేల కేజీల చికెన్ కర్రీ, ఫ్రై వండించారు. అంతేనా మరో 12 క్వింటాళ్ల మటన్ కొట్టించారు. అంటే 12 వందల కేజీల మటన్ కర్రీ, ఫ్రై తయారు చేయించారు దత్తన్న. చికెన్ మటన్ మాత్రమే కాకుండా చేపలు, రొయ్యలు పులుసులు, కర్రీ, ఫ్రై కూడా అలాయ్ బలాయ్ లో ఘుమఘుమలాడనుంది. 

మటన్, చికెన్ తోపాటు తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి దత్తన్న అలాయ్ బలాయ్ లో. ఒకేసారి 500 మంది భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 8 వేల మందికి భోజనాలు పెట్టనున్నారు. ఓవరాల్ గా వెజ్, నాన్ వెజ్ అన్నీ కలిపి 86 రకాల వంటకాలు ఉన్నాయి.  400 మంది కళాకారుల ఆటపాటలు అతిధులను అలరించనున్నాయి. 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ అలాయ్ బలాయ్ కు సినీ, రాజకీయ ప్రముఖలు అందరూ రాజకీయాలకు అతీతంగా హాజరయ్యారు.