కేసీఆర్ జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది: డీకే అరుణ

కేసీఆర్ జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది: డీకే అరుణ

ఆర్టీసీ కార్మికులు పండుగ చేసుకోకుండా పస్తులుంటే సీఎం కేసీఆర్ నిద్ర ఎలా పడుతుందని అన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. సోమవారం మహబూబ్ నగర్ బస్ డిపో ముందు RTC JACఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అరుణ పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. ఆర్టీసీని కేసీఆర్ చులకనాభావంతో చూస్తున్నారని… అధికారం శాశ్వతం కాదని అన్నారు. తొందరలోనే కేసీఆర్ జైలు జీవితం గడపాల్సివస్తదని అన్నారు. రాష్ట్రంలో ప్రజా తిరుగుబాటు ప్రారంభమైందని… కేసీఆర్ అవినీతి బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు.

సెల్ఫ్ డిస్మిస్ అనేది కేసీఆర్ కు వర్తిస్తుంది తప్ప… కార్మికులకు వర్తించదని అన్నారు అరుణ. మంత్రులు కేసీఆర్ చేతిలో కీలు బొమ్మలుగా మారారని అన్నారు. కార్మికులకు న్యాయం చేయలేని మంత్రి పదవులు ఎందుకని విమర్శించారు. కార్మికులకు బీజేపీ అండగా ఉంటదని అన్నారు అరుణ. రాష్ట్ర ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ కబ్జా చేస్తున్నారని…. కార్మికుల ఉసురు కేసీఆర్ కు తగులుతదని అన్నారు.