మాజీ మంత్రికి తప్పని లోన్ యాప్ వేధింపులు

మాజీ మంత్రికి తప్పని లోన్ యాప్ వేధింపులు

మీ బావమరిది..లోన్ తీసుకుని డబ్బులు కట్టలేదు..రూ. 8 లక్షలు చెల్లించకపోతే  పరువుతీస్తామంటూ ఏపీ మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు లోన్ యాప్ రికవరీ ఏజెంట్స్  కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
నెల్లూరులోని ఫ్లోట్రాన్‌ బ్యాంకులో పాతపాటి  అశోక్‌కుమార్‌ సన్నాఫ్ శ్రీనివాసులు అనే వ్యక్తి రూ. 8  లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని..ఆ లోన్ మీరే చెల్లించాలంటూ అనిల్ కుమార్ యాదవ్ కు లోన్ యాప్ నుంచి కాల్ చేశారు. 

నాకు బావమరిది లేడు..అశోక్ కుమార్ అనే వ్యక్తి తనకు తెలియదని...మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పినా..లోన్ యాప్ వాళ్లు వినలేదు. నేను ఎవరో తెలుసా..నేను మాజీ మంత్రిని..నెల్లూరు ఎమ్మెల్యేను అని చెప్పినా ..మాజీ మంత్రి అయినా..మనీ కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. పైగా డబ్బులు కట్టాల్సిందేనని ఎమ్మెల్యేకే అల్టీమేటం జారీ చేశారు. ఇద్దరు కలిసే వాడుకున్నారు కదా.. అంటూ మరోసారి బెదిరింపులకు దిగారు. మీరెవరో తెలియకండా..అతను మీ నెంబర్ ఎలా ఇస్తాడని ప్రశ్నించారు. 

20 సార్లు కాల్ చేశారని అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. ఎవరో తెలియని వ్యక్తి నా నెంబర్  ఇస్తే నాకేమి సంబంధం అని అన్నారు. నాకు బావమరిది లేడని చెప్పినా వినిపించుకోలేదు. బ్యాంకు మేనేజర్ నెంబర్ ఇవ్వమని అనిల్ కుమార్ చెప్పినా..మేనేజర్తో మాట్లాడి ఏం చేస్తారని ఆమె అనిల్ కుమార్కే ఎదురు ప్రశ్నలు వేసింది. పైగా ఆశోక్ కుమార్కు కాన్ఫరెన్స్ కాల్ కలపండి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చింది. బ్యాంకు అడ్రెస్ చెప్పండి..మా వాళ్లు వచ్చి మాట్లాడుతారు అంటే...వచ్చి డబ్బులు కడతారా అంటూ ప్రశ్నించింది. 

లోన్ యాప్ ప్రతినిధిల మాటలకు విసిగిపోయిన అనిల్ కుమార్ యాదవ్..చెడామడా తిట్టేశారు. దారిన పోయే వ్యక్తి తన నెంబర్..పేరును ఉపయోగించుకుంటే తనకు ఏం సంబంధమని కాల్ కట్ చేశారు.