
హైదరాబాద్, వెలుగు: శాసన మండలి సభ్యులుగా చాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. గురువారం అసెంబ్లీ వాయిదా పడ్డాక టీఆర్‌ఎస్ ఎల్పీకి వెళ్లిన కేటీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు క్యూ కట్టారు. వారితో కేటీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీలు ప్రొఫెసర్ సీతారాం నాయక్, బూర నర్సయ్యగౌడ్ తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌ను కోరారు. దీనిపై పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్‌కు వివరిస్తానని ఆయన చెప్పారు. పోడు సమస్య పరిష్కరించండి
పట్టా భూముల్లో గొయ్యిలు తవ్వుతూ అటవీ శాఖ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారని నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌కు చెందిన 40 మంది సర్పంచులు కేటీఆర్‌కు తెలిపారు. గురువారం టీఆర్‌ఎస్ ఎల్పీలో ఆయన్ను కలిసి తమ ప్రాంత రైతుల సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. రెండు రోజులు టైం ఇవ్వాలని, సమస్యను సీఎంకు వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.