
కర్ణాటకకు చెందిన జేడీఎస్ నేత,మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు. 2021లో తన గన్నికాడ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న ఒక మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలు రుజువయ్యాయి. జూలై 18న ఈ కేసు విచారణ పూర్తి చేసిన బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.శుక్రవారం (ఆగస్టు1) తీర్పును ప్రకటించింది. అయితే మంగళవారం శిక్షను ఖరారు చేయనుంది.
జేడీఎస్ మాజీ ఎంపీ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణపై పలు లైంగిక కేసులు నమోదు అయ్యాయి. 2021లో హసన్ జిల్లాలోని హోలెనరసిపురలో ఉన్న తన కుటుంబ ఫామ్‌హౌస్‌లో 48 ఏళ్ల మహిళపై రేవణ్ణ రెండు సార్లు అత్యాచారం చేశారని, ఈ చర్యను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి.శుక్రవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు రేవణ్ణను దోషిగా నిర్ధారించింది.
►ALSO READ | Pharma Shares: మందుల రేట్లు తగ్గించాలని సంస్థలకు ట్రంప్ లేఖ.. కుప్పకూలిన భారత ఫార్మా స్టాక్స్!
2024లో ఎన్నికలకు ముందు రేవణ్ణపై పలు లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. ఈ కేసులో విచారణ కోసం విదేశాలకు వెళ్లిన రేవణ్ణ మే 31, 2024న తిరిగి వచ్చినప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో SIT అతన్ని అరెస్ట్ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణను జేడీఎస్ పార్టీని నుంచి సస్పెండ్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.