
మాజీ ఎంపీ బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి బుధవారం పెద్దపల్లి జిల్లా పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన అంతర్గాం మండలంలోని పెద్దంపేట్ గ్రామంలో భూలక్ష్మి,మాలక్ష్మి,బొడ్రాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామస్థులు ఆయనను సాదరంగా ఆహ్వానించి.. శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని పోచమ్మ,హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆతరువాత వివేక్ గ్రామస్థులతో ముచ్చటించారు. ప్రజలను యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ వెంట గ్రామ సర్పంచ్ మెరుగు భాగ్యలక్ష్మి-గురువయ్య,బీజేపీ నాయకులు గడ్డం మధు,ఎంపిటిసి శరణ్య మధుకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.