పరీక్షల విషయంలో విద్యార్థులు ఆందోళన పడకుండా.. స్టూడెంట్స్ కు అవగాహన కల్పించేందుకు రాయ్ దుర్గ్ లోని టీ వర్క్స్ దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ మెంటర్ సంస్థ 3K, 5K, 10K ఎగ్జామ్ థాన్ రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ కరస్పాండెంట్ సరోజ వివేక్ ప్రారంభించారు. వారితో పాటు ఈ రన్ లో 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా అవసరమని సూచించారు. విద్యార్థులకైనా.. ఉద్యోగులకైనా .. రాజకీయనాయకులకైనా .. ఉదయం ఒకే సమయమని .. ఎవరికైనా ప్రతి రోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ..
తాను పాఠశాలలో చదివే రోజుల్లో టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవాడినని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు . విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని .... పరీక్షల విషయంలో పేరెంట్స్ ఒత్తిడి పిల్లలపై ఉండకూడదని.. అలాగే పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయకూడదన్నారు. ఎగ్జామ్ ఫియర్ వలన చాలామంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయని .. ఈ విషయంలో పేరెంట్స్ శ్రద్ద చూపాలని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ కరస్పాండెంట్ సరోజ వివేక్ మాట్లాడుతూ
ఎర్లీ మార్నింగ్ ఇంతమంది విద్యార్థులు వస్తారనుకోలేదని... ఇలాంటి ఈవెంట్ కి V6 మీడియా పార్టనర్ గా ఉండడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. స్కూల్స్.. కాలేజీల్లో.. విద్యార్థులు ఎలా ఉంటున్నారు.. వారు చదివే ఇనిస్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలన్నారు
ప్రస్తుతం సొసైటీలో చాలా మంది విద్యార్థులు అనవసరమైన వాటికి అడిక్ట్ అవుతున్నారన్నారు.
డ్రగ్స్, రీల్స్ కోసం .. స్మార్ట్ ఫోన్స్ తో గంటలకొద్దీ తో గడుపుతున్నారని... ఇది మంచిది కాదని విద్యార్థులకు సూచించారు. పిల్లలెవరూ ఎగ్జామ్స్ అంటే భయం పెట్టుకోవద్దని.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయించి.. ధైర్యం చెప్పాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ కరస్పాండెంట్ సరోజ వివేక్ అన్నారు.
ప్రతి విద్యార్థికి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని కావేరీ యూనివర్శిటి వీసీ ప్రవీణ్ రావు తెలిపారు. లెసన్స్ శ్రద్దగా చదివి అవగాహన చేసుకోవాలే కాని.. ఒత్తిడి పెంచుకోకూడదన్నారు. జీవితంలో ఎగ్జామ్స్ మాత్రమే ముఖ్యం కాదని .. టాలెంట్ ఉండాలన్నారు.
