జేఎన్‌టీయూహెచ్‌ ప‌రిధిలో 21న‌ జ‌ర‌గాల్సిన ప‌రీక్షలు వాయిదా

 జేఎన్‌టీయూహెచ్‌ ప‌రిధిలో 21న‌ జ‌ర‌గాల్సిన ప‌రీక్షలు వాయిదా

హైద‌రాబాద్ : జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ హైద‌రాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌) ప‌రిధిలో జులై 21న జ‌ర‌గాల్సిన ప‌రీక్షల‌ను వాయిదా వేసిన‌ట్లు యూనివ‌ర్సిటీ అధికారులు ప్రక‌టించారు. శుక్రవారం (జులై 21న) నిర్వహించాల్సిన బీటెక్(ఆర్18, ఆర్16, ఆర్15, ఆర్13), బీ ఫార్మసీ(ఆర్17, ఆర్16, ఆర్ 15, ఆర్13) థ‌ర్డ్ ఇయ‌ర్ సెకండ్ సెమిస్టర్ ప‌రీక్షలను 26వ తేదీన నిర్వహించ‌నున్నట్లు ప్రక‌టించారు.

వీటితో పాటు బీటెక్ ఆర్18 అల్లైడ్ బ్రాంచెస్ ప‌రీక్షల‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. భారీ వ‌ర్షాల కార‌ణంగానే ప‌రీక్షల‌ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల‌కు గురు, శుక్ర, శనివారాల్లో సెల‌వులు ప్రక‌టించిన విషయం తెలిసిందే.