ఎక్సైజ్ శాఖలో IPL టికెట్ల లొల్లి

ఎక్సైజ్ శాఖలో IPL టికెట్ల లొల్లి

కాంప్లిమెంటరీ టికెట్లు కావాలని HCAకి మేడ్చల్ అధికారి లెటర్

లేఖపై ఎక్సైజ్ శాఖ చీఫ్ సెక్రటీ సోమేశ్ కుమార్ సీరియస్

హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో IPL ఫైనల్ టికెట్ల లొల్లి నడుస్తోంది. 300 వరకు కాంప్లిమెంటరీ టిక్కెట్లు రిజర్వ్ చేయాలంటూ.. HCAకు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారి లెటర్ రాయడం.. ఆ శాఖలో వివాదాస్పదమైంది. టికెట్లు కావాలని అడగడంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సీరియస్ గా తీసుకుంది.

IPL ఫైనల్ మ్యాచ్ కోసం 300 టికెట్లు అడుగుతూ HCA కు మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీనియర్ అధికారి ప్రదీప్ రావు ఇటీవల లెటర్ రాశారు.  50 కార్పొరేట్ బాక్స్, 250 ప్రివిలేజ్ పాస్‌లు కలిపి.. 300 టికెట్లు కావాలంటూ ప్రదీప్‌రావు ఎక్సైజ్ శాఖకు లెటర్ రాసి పంపించారు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో.. ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌ .. సంబంధిత అధికారులనుంచి వివరణ కోరారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి… అధికారిక కార్యాలయం నుంచి  ఇలా సిఫారసు లెటర్ రాయడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వెంటనే వివరణ ఇవ్వాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీనియర్ అధికారి ప్రదీప్ రావు కు మెమో జారీ చేశారు.